డీఓపీ రత్నవేలు ఇంట విషాదం..!

డీఓపీ రత్నవేలు ఇంట విషాదం..!

Published on Mar 21, 2020 5:24 PM IST

టాలీవుడ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్న వేలు ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లిగారైన జ్ఞానేశ్వరి రామన్ నేడు ఉదయం చెన్నై లో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం వలన వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మరణించినట్లు తెలుస్తుంది. నేడు లేదా రేపు ఆమె అంత్యక్రియలు జరపనున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలన్నిటికీ రత్న వేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు పనిచేశారు. రంగస్థలం సినిమాకు ఆయన బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు.

తాజా వార్తలు