ఆర్ ఆర్ ఆర్ టీం అక్కడ తేలింది ఏమిటీ?

ఆర్ ఆర్ ఆర్ టీం అక్కడ తేలింది ఏమిటీ?

Published on Mar 21, 2020 10:42 AM IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ నల్గొండ కబడ్డీ టీం తో పోజిచ్చారు. విజేతలతో నిలబడి వారు ఫోటోలు దిగారు. వీరిద్దరితో పాటు ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో నల్గొండ జిల్లా జట్టు ఛాంపియన్ గా నిలవగా వారితో కలిసి ఎన్టీఆర్, చరణ్ మరియు రాజమౌళి ఫోటోలు దిగారు. స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్ అక్కడ దర్శనమివ్వడంతో వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయిందని సమాచారం.

ఇక ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో మొదలుకానుంది. తదుపరి షెడ్యూల్ జక్కన్న పూణే లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జనవరి 8, 2021లో పాన్ ఇండియా మూవీగా పది భాషలలో విడుదల కానుంది.

తాజా వార్తలు