కరోనా వైరస్ ప్రభావం ప్రపంచాన్ని కుదిపేస్తుండగా, భారత్ లో కూడా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుండటం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య వందల్లోకి చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. దీనితో ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం దీని నివారణకు ఓ వినూత్న కార్యక్రమం మొదలుపెట్టింది.
దేశ గౌరవ ప్రధాన మంత్రి జనతా కర్ఫ్యూ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించారు. దీనిలో భాగంగా వచ్చే ఆదివారం ప్రజలు స్వచ్చంధ కర్ఫ్యూ పాటించ వలసిందిగా ఆయన కోరారు. అనగా వచ్చే ఆదివారం ఎవరూ ఇంటిలో నుండి బయటకి రాకుండా కర్ఫ్యూ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.బీజేపీ పార్టీలో భాగమైన పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రధాని చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగం కావాలని ఓ వీడియో ద్వారా చెప్పారు. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ట్విట్టర్ వేదికగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని హితవు పలికారు.