ఈ శుక్రవారం ఇండస్ట్రీకి డ్రై డే

ఈ శుక్రవారం ఇండస్ట్రీకి డ్రై డే

Published on Mar 21, 2020 12:00 AM IST

ప్రపంచమంతా కోవిడ్ 19 భయంతో వణికిపోతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా సామాజిక దూరం పేరుతో అన్ని రంగాలకు సెలవులు ప్రకటించాయి. వాటిలో ప్రధానంగా సినీ పరిశపరిశ్రమ కూడా ఉంది. ప్రస్తుతం దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలు దాదాపు మూతబడిపోయాయి. షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు విడుదలలు కూడా వాయిదాపడ్డాయి.

టాలీవుడ్లో అయితే ప్రతి శుక్రవారం తప్పకుండా రెండు మూడు సినిమాలు విడుదలయ్యేవి. సినీ అభిమానులు ప్రతి శుక్రవారం వస్తోందంటే ఏదో ఒక సినిమా చూసి రిలాక్స్ అయ్యేవారు. కానీ ఈ శుక్రవారం ఆ పరిస్థితి లేదు. థియేటర్లు బంద్ కావడంతో ఈ శుక్రవారం విడుదలకావాల్సిన చిత్రాలన్నీ వాయిదాపడ్డాయి. అన్ని రంగాలు ఏదో ఒక ప్రత్యామ్నాయం వెతుక్కుని పాక్షికంగా అయినా పనిచేస్తోంటే థియేటర్ రంగం మాత్రం పూర్తిగా స్థంభించిపోయింది. కోట్ల రూపాయల బిజినెస్ ఆవిరైపోయింది. ఇది వరకెప్పుడూ ఈ పరిస్థితి తలెత్తిన దాఖలాలు లేవు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల పరిస్థితి ఇలానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫ్రైడే మూవీ ఇండస్ట్రీకి డ్రై డే అనొచ్చు.

తాజా వార్తలు