నిర్బంధంలో రెబెల్ స్టార్ ప్రభాస్

నిర్బంధంలో రెబెల్ స్టార్ ప్రభాస్

Published on Mar 20, 2020 3:50 PM IST

హీరో ప్రభాస్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇటీవలే తన లేటెస్ట్ మూవీ జార్జియా షెడ్యూల్ నుండి ప్రత్యేక విమానంలో ఇండియా చేరిన ప్రభాస్ ఇంటికి పరిమితం అయ్యారు. ప్రాణాంతక కరోనా వైరస్ ఇండియాలో సైతం విజృంభిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా అనేక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో సెలెబ్రిటీలు ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఇలా స్వీయ నిర్బంధం విధించుకుంటున్నారు. అత్యవసరమైతే తప్పితే బయట తిరగొద్దు, అలాగే సోషల్ లైఫ్ వదిలేయమని కోరుతున్నారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మొదటిసారి పూజ హెగ్డే ప్రభాస్ తో ఈ చిత్రం ద్వారా జతకడుతుంది. యూవీ క్రియేషన్స్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తెలుగు మరియు హిందీ, తమిళ భాషలలో విడుదలకానుంది. ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

తాజా వార్తలు