నారప్ప…70 శాతం పూర్తైంది

నారప్ప…70 శాతం పూర్తైంది

Published on Mar 19, 2020 11:00 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నారప్ప’. జనవరిలో మొదలైన మొదటి షెడ్యూల్ నిన్ననే ముగిసింది. కేరళ సరిహద్దుల్లో షూటింగ్ చేస్తున్న టీమ్ కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా నాలుగు రోజుల షూట్ మిగిలి ఉండగానే ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ రిటర్న్ అయ్యారు. జనవరి నుండి ఎలాంటి బ్రేక్ లేకుండా నడిచిన షూట్ 56 రోజులపాటు జరిగిందట. ఈ లాంగ్ షెడ్యూల్లో 65 నుండి 70 శాతం షూటింగ్ ముగిసిందట.

పీటర్ హెయిన్స్ సారథ్యంలో మూడు కీలకమైన ఫైట్స్, కథానాయకుడి కుటుంబ నేపథ్యంలో నడిచే ఎమోషనల్ సీన్స్, ఛేజింగ్ సన్నివేశాలు తెరకెక్కించారట. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ చాలా బాగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది.

తాజా వార్తలు