సోనమ్ కపూర్… పరిచయం అక్కరలేని బాలీవుడ్ హీరోయిన్. హీరో అనిల్ కపూర్ నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని హీరోయిన్ గా బాగానే చలామణి అవుతొంది. అయితే ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా వైరస్ దెబ్బకు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే సామాజిక జీవితాలకు దూరంగా ఉండమని అన్ని దేశాల్లో ప్రజలను ఆదేశిస్తున్నాయి ఆయా దేశాల ప్రభుత్వాలు.
అలాగే ఇండియాలో కూడా. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారందరూ తమకు తాము గృహ నిర్బంధం వేసుకున్నారు. ఇప్పుడు వారిలో సోనమ్ కపూర్ కూడా చేరింది. తన సొంత అత్తగారితో కూడా చాల దూరంగా నిలబడి సైగలతోనే కమ్యూనికేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. సోనమ్ ఓ వ్యాపారవేత్తను పెళ్లీ చేసుకున్న విషయం తెలిసిందే. వీడియోలో కనిపిస్తోన్న రెండో ఆమె.. సోనమ్ భర్త తల్లినే.
Here’s how #SonamKapoorAhuja is maintaining contact with her mother-in-law #PriyaAhuja during self quarantine. pic.twitter.com/etkBTnnFxF
— Filmfare (@filmfare) March 19, 2020