ప్రభాస్ బ్యానర్ లో అనుష్క మూవీ..!

ప్రభాస్ బ్యానర్ లో అనుష్క మూవీ..!

Published on Mar 17, 2020 11:55 AM IST

టాలీవుడ్ లో అనుష్క క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తెలుగు పరిశ్రమలో చాల కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాగే అనుష్క ఇప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు మొదటి ఛాయిస్. అనుష్క నటించిన హార్రర్ థ్రిల్లర్ నిశ్శబ్దం త్వరలో విడుదల కానుంది. కాగా అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తుండగా అది ప్రభాస్ చిత్రాలను నిర్మించే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనుందని తెలుస్తుంది.

యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశీ ప్రభాస్ కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వరుసగా ఆయనతో సినిమాలు చేస్తున్నారు. కాగా అనుష్కతో ఓ మూవీ చేయడానికి వారు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అనుష్క మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి, అలాగే రా రా కృష్ణయ్య దర్శకుడు మహేష్ తో కూడా మూవీ చేయడానికి ఆమె సుముఖత చూపినట్లు తెలుస్తుంది. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఎదో ఒకటి యూవీ క్రియేషన్స్ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు