పండగ చేసుకుంటున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్

పండగ చేసుకుంటున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్

Published on Mar 16, 2020 10:45 PM IST

కరోనా ఎఫెక్ట్ కారణంగా అనేక రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణల్లో కూడా థియేటర్లు మూతబడ్డాయి. ఈ నెల 31 వరకు ఈ పరిస్ఠితి కొనసాగనుంది. దీంతో పూర్తైన సినిమాల విడుదలలు వాయిదాపడ్డాయి. షూటింగ్స్ మొత్తం నిలిచిపోయాయి. వేలమంది సినీ కార్మికులకు పని లేదు. ఇక థియేటర్ బిజినెస్ పూర్తిగా మూతబడింది. ఇలాంటి కష్ట కాలంలో ఒటీటీ ప్లాట్‌ఫామ్ బిజినెస్ మాత్రం ఊపందుకుంటోంది.

రెండు రాష్ట్రాల్లోని అనేక ఐటీ, ప్రైవేట్ కంపెనీలు, కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో సినిమాల మీద ఆసక్తి ఉన్న జనం థియేటర్లు మూతబడటం, ఇతర వినోద మార్గాలు లేకపోవడంతో అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, జీ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీదే ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటున్నారు. పైగా ఓటీటీ సంస్థలు సభ్యత రుసుమును కూడా తక్కువ చేయడంతో పెద్ద ఎత్తున కొత్త సభ్యత్వాలు నమోదవుతున్నాయట. మొత్తానికి కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇతర రంగాల్ని కుదిపేసినా ఓటీటీ రంగం మాత్రం బలపడుతోంది.

తాజా వార్తలు