లావణ్యకు లక్కీ ఛాన్స్ దొరికిందా ?

లావణ్యకు లక్కీ ఛాన్స్ దొరికిందా ?

Published on Mar 16, 2020 3:48 PM IST

లావణ్య త్రిపాఠి.. కెరీర్ మొదట్లో బాగానే ఆఫర్లు అందుకున్న ఈ అందాల భామ కొన్నాళ్లు ఆఫర్లు లేక చాలాన ఇబ్బందులుపడింది. ఈమధ్యే ‘అర్జున్ సురవరం’తో హిట్ అందుకున్న ఈమెకు ప్రస్తుతం రెండు ఆఫర్లు చేతిలో ఉన్నాయి. ఇవి కాకుండా ఆమెకు ఒక పెద్ద ఆఫర్ అందినట్టు ఫిల్మ్ నగర్ టాక్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీరామ్ వేణు డైరెక్షన్లో ‘వకీల్ సాబ్’ అనే సినిమా చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ మినహా షూట్ మొత్తం ముగిసింది.

ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో హీరో పర్సనల్ లైఫ్ ట్రాక్ ఉంటుంది. ఇందులో కథానాయకిగా మొడటి నుండి శృతి హాసన్ పేరు పరిశీలనలో ఉంది. కానీ ఇప్పుడు లావణ్య త్రిపాఠి పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా లేకపోతే శృతి, లావణ్య త్రిపాఠిలో ఒక్కరినే తీసుకుంటారా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇందులో లావణ్యకు గనుక ఛాన్స్ దొరికితే ఆమె కెరీర్ మరోసారి మెరుపులు అందుకోవడం ఖాయం.

తాజా వార్తలు