రానా అరణ్య మూవీ విడుదల వాయిదా..!

రానా అరణ్య మూవీ విడుదల వాయిదా..!

Published on Mar 16, 2020 12:07 PM IST

రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అరణ్య. తెలుగు మరియు హిందీ, తమిళ భాషలలో ఈ చిత్రం వచ్చే నెల 2న విడుదల కానుంది. కాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు నేడు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర విడుదల వాయిదా వేస్తున్నట్లు వారు చెప్పడం జరిగింది. అలాగే ప్రజారోగ్యమే ప్రథమం అన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.

హిందీలో ఈ చిత్రం హాథీ మేరె సాథీ పేరుతో విడుదల అవుతుండగా, అడవి జంతువుల మనుగడ కోసం పోరాడే అడవి తెగకు చెందిన వ్యక్తిగా రానా నటిస్తున్నారు. అరణ్య మూవీ ఏరోస్ ఇంటర్నేషనల్ నిర్మించగా, దర్శకుడు ప్రభు సోలొమన్ తెరకెక్కించారు.

తాజా వార్తలు