ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ మే లో డౌటే..?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ మే లో డౌటే..?

Published on Mar 15, 2020 3:48 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తూనే తన 32వ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించారు. ఈ చిత్రం ఈ ఏడాది మే లో సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే నిరవధికంగా షూటింగ్ జరిపి 2021 ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు చెప్పడం జరిగింది. ఐతే అనుకున్న ప్రకారం ఎన్టీఆర్ మూవీ మే లో సెట్స్ పైకి వెళ్లడం అనుమానంగానే ఉంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే అనేక చిత్రాల షూటింగ్ మరియు విడుదల వాయిదా పడిన నేపథ్యంలో చెప్పినట్లుగా మేలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పలేం.

ఒక వేళ ఈ రెండు నెలల్లో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తే మాత్రం చెప్పిన ప్రకారం మే లో షూట్ మొదలవుతుంది. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ ఈ ఏడాది అల వైకుంఠపురంలో మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరుణంలో ఎన్టీఆర్ మూవీపై భారీ అంచనాలున్నాయి.

తాజా వార్తలు