చిరు 152 కోసం భారీగా డిమాండ్ చేస్తున్న కాజల్..కారణం?

చిరు 152 కోసం భారీగా డిమాండ్ చేస్తున్న కాజల్..కారణం?

Published on Mar 15, 2020 1:30 AM IST

హీరోయిన్ త్రిష నిన్న చిరు 152 మూవీ నుండి తప్పుకున్నట్లు ప్రకటించి సంచలనం రేపింది. ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా త్రిషా, చిరు సినిమా నుండి తప్పుకున్నట్లు చెప్పడం జరిగింది. కాగా ఇప్పుడు త్రిషా స్థానంలో హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేశారట. త్వరలోనే ఆమె ఈ మూవీ సెట్స్ లో పాల్గొననున్నారట. అధికారిక ప్రకటన కూడా దీనిపై చిత్ర యూనిట్ చేయనున్నారని వస్తున్న సమాచారం.

కాగా ఈ చిత్రం కోసం కాజల్ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. నిజానికి ప్రస్తుతం కాజల్ కి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. అయినప్పటికీ పాత్ర రీత్యా ఆమె కొంచెం ఎక్కువగానే అడుగుతున్నారని వినికిడి. గతంలో కాజల్ చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150లో నటించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు