కరోనా కారణంగా వి మూవీ విడుదల వాయిదాపడిన నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్లైంది. ప్రదీప్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?. ఉగాది కానుకగా ఈనెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. నాని, సుధీర్ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ వి మూవీ సైతం ఇదే తేదీన విడుదల కావాల్సివుండగా నేడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నాని ఉగాది రేసు నుండి తప్పుకోవడంతో ప్రదీప్ పండగను సోలోగా దున్నుకోనున్నాడు.
ఇక 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీని దర్శకుడు మున్నా తెరకెక్కించారు. ఈ చిత్రంలో బిగిల్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంగీతం అనూప్ రూబెన్స్ అందించగా సాంగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.