ఆ యంగ్ హీరోయిన్ ఫేవరేట్ హీరో బన్నీ అట.

ఆ యంగ్ హీరోయిన్ ఫేవరేట్ హీరో బన్నీ అట.

Published on Mar 11, 2020 8:15 PM IST

గత ఏడాది విజయ్ హీరోగా వచ్చిన విజిల్ సినిమాలో నటించింది యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్. ఆ చిత్రంలో లేడీ ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించిన ఈ భామ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. యాంకర్ సుధీర్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న చిత్రం 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ చిత్రంలో అమృత హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఉగాది కానుకగా ఈనెల 25న విడుదల కానుంది.

కాగా నేడు చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. హీరోయిన్ అమృత మాట్లాడుతూ తన ఫెవరేట్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పారు. ఆయన సినిమాలను బాగా ఇష్టపడతాను అని చెప్పిన ఆమె తమ చిత్రం 30రోజుల్లో ప్రేమించడం ఎలా? గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ ద్వారా విడుదల కావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజా వార్తలు