తమిళ్ స్టార్ హీరో విజయ్ గత ఏడాది బిగిల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తెలుగులో ఈ చిత్రం విజిల్ పేరుతో విడుదలయ్యింది. ఈ మూవీలో లేడీ ఫుట్ బాల్ ప్లేయర్స్ గా నటించిన అమ్మాయిలలో కొందరు హీరోయిన్స్ గా అవకాశాలు దక్కించుకుంటున్నారు. వారిలో అమృత అయ్యర్ ఒకరు. అమృత అయ్యర్ ఇప్పటికే యాంకర్ సుధీర్ హీరోగా పరిచయమవుతున్న 30రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇటీవల నాగ శౌర్య హీరోగా ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. నిర్మాత మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వం వహించనున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అమృత అయ్యర్ ని తీసుకున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.