కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలలో సైతం జనం హడిలిపోతున్నారు. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలలో కూడా అక్కడక్కడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణా గవర్నమెంట్ చేపట్టిన అవగాహన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ భాగమయ్యారు. ఓ ప్రత్యేక వీడియోలో కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు.
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాధ్ మూవీ షూటింగ్ ముంబై షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది.విజయ్ దేవరకొండ 10వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో ఆయన ప్రొఫెషనల్ ఫైటర్ గా నటిస్తున్నాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కరణ్ జోహార్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుంది.
Issued in Public Interest#VijayDeverakonda lists out Dos and Don'ts in the outbreak of #Coronavirus
Need not panic about #Corona pic.twitter.com/7SEC3FT83N
— BA Raju's Team (@baraju_SuperHit) March 10, 2020