‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో విజయాన్ని అందుకున్న మెగా హీరో సాయి తేజ్ ప్రస్తుతం కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్షన్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే షూట్ జరుగుతుండగా మే 1న చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రం తర్వాత తేజ్ దేవ కట్ట దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారనే టాక్ వినబడింది.
తాజా సమాచారం మేరకు ఈ వార్త నిజమేనని, తేజ్ దేవ కట్టతో చిత్రం ఓకే అయిందని తెలుస్తోంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల తర్వాత ఒక నెలకు ఈ చిత్రం స్టార్టవుతుందట. ఇది దేవ గత సినిమాల మాదిరి పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాలా ఉండదట. కమర్షియల్ హంగులతో పాటు బలమైన సోషల్ మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది.