‘పిల్ల పులి’ ప్రోమోతో.. ‘ఆకాశం నీ హద్దురా’. !

‘పిల్ల పులి’ ప్రోమోతో.. ‘ఆకాశం నీ హద్దురా’. !

Published on Feb 13, 2020 3:33 PM IST

సూర్య లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ సినిమా నుండి ‘పిల్ల పులి’ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. సాంగ్ లో లవ్ ఫీలింగ్ తో పాటు ఎమోషన్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక హీరో సూర్యకు తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవుతూనే ఉంటుంది. తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఇందులో ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సూర్యకి గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే సూర్య ఆశలు పెట్టుకున్నారు.

తాజా వార్తలు