యంగ్ హీరో కార్తికేయ కొత్త అవతారం ఎత్తాడు. బస్తీ బాలరాజు గా లుంగీలో ఇరగదీస్తున్నాడు. విషయంలోకి వెళితే కార్తికేయ హీరోగా నేడు ఓ కొత్త మూవీ ప్రారంభించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్ 2 పతాకంలో ఈ చిత్రం రూపొందుతుంది. ‘చావు కబురు చల్లగా’ అనే ఓ డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమాలతో అధికారికంగా మూవీ ప్రారంభమైంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.
ఈ చిత్రంలోని కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.ఈనెల 19వ తేదీ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇక గత ఏడాది కార్తికేయ మూడు సినిమాలు విడుదల చేశారు. వాటిలో గుణ 369 అతనికి ఓ మోస్తరు విజయాన్ని అందించింది. ఆర్ ఎక్స్ 100 తరువాత ఆ స్థాయి విజయాన్ని కార్తికేయ అందుకోలేదు. మరి చావు కబురు చల్లగా సినిమాతోనైనా ఆయన మంచి హిట్ అందుకుంటారేమో చూడాలి.