పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ పింక్ రీమేక్ షూటింగ్ నిరవధికంగా కొనసాగుతుంది. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పింక్ రీమేక్ కి సంగీత దర్శకుడిగా థమన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పవన్ మూవీ కోసం బెస్ట్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్నానంటూ థమన్ ఫ్యాన్స్ కి హామీ కూడా ఇచ్చారు.
కాగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం తాను స్వరపరిచిన సాంగ్ ని పాడటానికి సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ని దింపారు. పవన్ సినిమాలో సిద్ ఓ పాట పాడుతున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా హింట్ కూడా ఇస్తున్నారు. ఇక అల వైకుంఠపురంలో సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సామజవరగమన… సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ తో చేయనున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.