కెజిఎఫ్ 2లో ఆ పాత్రకు మొదటి ఛాయిస్ బాహుబలి నటి.

కెజిఎఫ్ 2లో ఆ పాత్రకు మొదటి ఛాయిస్ బాహుబలి నటి.

Published on Feb 12, 2020 1:22 PM IST

దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉన్న చిత్రాలలో కెజిఎఫ్ 2 ఒకటి. కెజిఎఫ్ మొదటి భాగం భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దీని సీక్వెల్ పై విపరీతమైన అంచనాలున్నాయి. కెజిఎఫ్ 2 షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ మూవీని జులైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా కెజిఎఫ్ 2లో లేడీ పీఎం పాత్ర కోసం రవీనా టాండన్ ని తీసుకున్నారు. రాఖీ భాయ్ పై డెత్ వారెంట్ జారీ చేసి, తన రాజ్యం పైకి సైన్యాన్ని పంపే లేడీ ప్రధాన మంత్రిగా ఆమె కనిపించనున్నారు. ఐతే మొదట ఈ పాత్ర కోసం రమ్య కృష్ణను అనుకున్నారట. ఐతే ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో బదులుగా రవీనా టాండన్ ని ఎంపిక చేశారని సమాచారం.

ఈ వార్త ఇప్పుడు కన్నడ పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక తెలుగు యాక్టర్ రావు రమేష్ కెజిఎఫ్ 2లో ఓ పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరా పాత్ర చేస్తుండగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

తాజా వార్తలు