రాజకీయాల కోసం రెండేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరసగా మూడు సినిమాలు ప్రకటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ మరియి హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రం. క్రిష్ దర్శకుడిగా ఓ పీరియాడిక్ మూవీ ఆయన చేస్తున్నారు. కాగా క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా టైటిల్ కి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.
క్రిష్ పవన్ సినిమాను పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న క్రమంలో ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే ఓ క్లాసిక్ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో పవన్ పేరు వీరు అని దాంతో పాటు ఈ సినిమా కథకు కూడా ‘విరూపాక్షి’ టైటిల్ కూడా చక్కగా సరిపోతుందని చిత్రయూనిట్ భావిస్తుందట. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాలి.