హిట్ టైటిల్ వెనుక అసలు కథ అదే..!

హిట్ టైటిల్ వెనుక అసలు కథ అదే..!

Published on Feb 11, 2020 11:15 AM IST

నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హిట్. దర్శకుడు శైలేష్ కొలను సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. నేడు ఈ చిత్రం నుండి చిన్న ప్రోమో వీడియో విడుదల చేశారు. హిట్ అనే టైటిల్ వెనుక గల ఆంతర్యం ఏమిటో ఆ ప్రోమో ద్వారా తెలియజేశారు. హిట్ అనగా హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన టీమ్ గా హిట్ ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఓ సీరియస్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. అలాగే హిట్ మూవీ ప్రీతి అనే ఓ అమ్మాయి మిస్సింగ్ మిస్టరీ చుట్టూ లేదా అమ్మాయిల కిడ్నాప్స్ చుట్టూ తిరుగుతుంది అని అనిపిస్తుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది.

ప్రోమో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు