ఈ సినిమా క్లాస్, మాస్ అని తేడా లేకుండా ఆడుతుంది

ఈ సినిమా క్లాస్, మాస్ అని తేడా లేకుండా ఆడుతుంది

Published on Nov 11, 2012 8:28 PM IST

క్లాస్ మరియు విమర్శకులకు మాత్రమే నచ్చే సినిమాలు తీస్తాడనే పేరున్న క్రియేటివ్ దర్శకుడు క్రిష్ ఈ సారి కృష్ణం వందే జగద్గురుం సినిమాతో త్వరలో మన ముందుకి రానున్నాడు. తన సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్న క్రిష్ ఈ సినిమా క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరికి నచ్చుతుంది అంటున్నాడు. ఈ సినిమా కోసం టీం అంతా చాల కష్ట పడ్డాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుందని నమ్మకంతో ఉన్నాం. రానా, నయనతార జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 30 న విడుదలకి సిద్ధమవుతుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన లభిస్తోంది. ఫస్ట్ ఫ్రేం బ్యానర్ పై సాయి జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు