శివుడికి అభిషేకం చేయమని పిలుపునిచ్చిన నాగ్

శివుడికి అభిషేకం చేయమని పిలుపునిచ్చిన నాగ్

Published on Nov 10, 2012 5:04 PM IST


‘కింగ్’ అక్కినేని నాగార్జున తొలిసారి నటించిన సోషియో ఫాంటసీ సినిమా ‘డమరుకం’. ఈ సినిమా ఇప్పటికే పలు సార్లు రిలీజ్ డేట్ ఇచ్చి కూడా వాయిదావేసారు. ఈ రోజు విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈరోజు కాకినాడలో కళ్యాణ్ జ్యువెలరీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాగార్జున ఈ విషయం పై స్పందిస్తూ ‘డమరుకం’ సినిమా కోసం మీరు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. కానీ దానికింకా శివుడు ఆజ్ఞ రాలేదు. ఆ ఈశ్వరుడు ఇంకా ముహూర్తం పెట్టలేదు పెట్టగానే సినిమా విడుదలవుతుంది. నా అభిమానులందరూ వెళ్లి శివుడికి అభిషేకం చేయండి సినిమా రిలీజ్ అవుతుందని’ అన్నారు. ఈ రోజు రిలీజ అవుతుందని ఆశతో థియేటర్లకు వెళ్ళిన చాలా మంది సినిమా లేదని తెలిసి పూర్తి నిరుత్సాహంతో వెనుతిరిగారు. పలు చోట్ల నిరుత్సాహంతో థియేటర్ల పైకి రాళ్ళు కూడా విసిరారు. నాగ్ చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఈ వారంలో ఖచ్చితంగా విడుదలయ్యేలా అనిపిస్తోంది, మనం కూడా అది నిజమవ్వాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు