మల్టీప్లెక్సుల్లో ముందుగానే రానున్న ‘బస్ స్టాప్’

మల్టీప్లెక్సుల్లో ముందుగానే రానున్న ‘బస్ స్టాప్’

Published on Nov 10, 2012 2:29 PM IST


ఈ రోజుల్లో సినిమా ద్వారా హిట్ అందుకున్న దర్శకుడు మారుతి మరియు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘బస్ స్టాప్’. ఈ సినిమా నవంబర్ 11న భారీగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. నిర్మాత బెల్లంకొండ మాట్లాడుతూ ‘ ట్రిబ్యునల్ వారి పర్యవేక్షణతో 5 చిన్న చిన్న కట్స్ తో సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది, సెకండాఫ్ లో పిల్లలకి మరియు తల్లితండ్రులకి మధ్య జరిగే సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. ఈ సినిమా డైరెక్టర్ గా మారుతికి మరియు నటుడిగా రావు రమేష్ కి మంచి పేరు తెచ్చి పెడుతుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండడంతో ఈ రోజు సాయంత్రం నుంచే హైదరాబాద్ మల్టీ ప్లెక్సుల్లో షోలు వేస్తున్నామని ఆయన’ అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘ ఈ సినిమా ఫుల్ యూత్ ఎంటర్టైనర్ గా ఉంటూనే అంతర్లీనంగా పెద్దలు పిల్లలతో ఎలా ఉండాలి అని చెప్పే మెసేజ్ ఉంటుంది. రావు రమేష్ గారు తన కిచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసారు, ఆయన పాత్ర సినిమాలో హైలైట్ అవుతుంది. ఇది పిల్లలు మరియు పెద్దలు కలిసి చూడాల్సిన సినిమా’ అని అన్నారు. రావు రమేష్ మాట్లాడుతూ ‘ డైరెక్టర్ మారుతి కి మరియు సినిమాటోగ్రాఫర్ ప్రభాకర్ రెడ్డి కాంబినేషన్ మరియు వారి ఎనర్జీ లెవల్స్ కూడా బాగున్నాయి అంతకంటే మించి ఏ సీన్ ఎలా ఉండాలి అనేదాని మీద పూర్తి అవగాహన ఉందని’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రిన్స్, హీరోయిన్ శ్రీ దివ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు