దేవీ శ్రీ డైరెక్షన్లో మెగాస్టార్.!

దేవీ శ్రీ డైరెక్షన్లో మెగాస్టార్.!

Published on Nov 10, 2012 12:24 PM IST


టాలీవుడ్ ఎనర్జిటిక్ మరియు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ‘దేవీ’ సినిమాతో తన సంగీత ప్రస్థానాన్ని మొదలుపెట్టి అప్పుడే ‘డమరుకం’తో మ్యూజిక్ డైరెక్టర్ గా 50 చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఎప్పుడు స్టేజ్ పైన తన సంగీతం, అల్లరి మాటలతో మరియు డాన్సులతో మాత్రమే కనిపించే దేవీ శ్రీ లో మనందరికీ తెలియని ఇంకొక కళ కూడా ఉందండోయ్. ఒక ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని బయట పెట్టారు. దేవీ కి సంగీతంతో పాటు ఫోటోగ్రఫీ మరియు లఘు చిత్రాలు తీయడం అంటే కూడా చాలా ఇష్టమట. దేవీ శ్రీ ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే ‘ సంగీతం కాకుండా నేను బాగా ఇష్టపడేది ఫోటోగ్రఫీ. నా దగ్గర ఒక మంచి కెమరా ఉండేది దానితో నేను కొన్ని లఘు చిత్రాలు తీసేవాడిని. నా ఆల్బమ్స్ మరియు ఆ లఘు చిత్రాలను ఒక రోజు మెగాస్టార్ చిరంజీవి గారు చూసారు. చాలా బాగా తీసావు ఇంకేముందీ డైరెక్టర్ అయిపోవచ్చుగా నువ్వు డైరెక్షన్ చేస్తానంటే నేను నీ సినిమాలో నటిస్తానని ఆయన అనగానే నేను షాక్ కి గురయ్యాను’ అని అన్నారు.

చిరు ఈ విషయం చెప్పిన వెంటనే దేవీ శ్రీ ప్రసాద్ కథ సిద్దం చేసుకుని ఉంటే ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడైతే 95% ఆ అవకాశం లేదు ఎందుకంటే చిరు రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు చేయనన్నారు కనుక ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా లేనట్టే. మ్యూజిక్ డైరెక్టర్ గా యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు