సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ ఇద్దరూ వారి వారి విభాగాల్లో బాగా ఫేమస్. అలాంటి వారిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా అనుకున్నారు, తీరా సెట్స్ పైకి వెళ్ళే సమయానికి అది మారిపోయింది. ఇంతకీ ఎవరా ఆ ఇద్దరూ అనుకుంటున్నారా? మరెవరో కాదండీ మన యూనివర్సల్ హీరో కమల్ హసన్ మరియు డైరెక్టర్ సెల్వ రాఘవన్. వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమానే ‘ విశ్వరూపం’ కానీ చివరి నిమిషంలో అది మారి పోవడంతో దర్శకత్వ భాధ్యతలు కూడా కమల్ తీసుకున్నాడు. ఇంతకీ ఈ సినిమా ఎందుకు వదిలేసారు అని సెల్వ రాఘవన్ ని అడిగితే ఆయన సమాధానమిస్తూ ‘ సినిమాలో క్రియేటివిటీ చూపించాల్సిన విషయం చాలా ఎక్కువ ఉంది, ఈ విషయంలో నాకు పూర్తి కంట్రోల్ ఇమ్మంటే ఇవ్వనన్నారు. అలా నాకు ఫ్రీడం ఇవ్వకపోతే నేను ఆ సినిమా చేయాల్సిన అవసరం లేదు, చేసినా వృధానే కదా అని ఈ సినిమా వద్దనుకున్నానని’ అన్నారు.
ప్రస్తుతం సెల్వ రాఘవన్ తమిళ హీరో ఆర్య మరియు అనుష్కలతో ‘బృందావనంలో నందకుమారుడు’ సినిమాని ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తవ్వగానే రానతో ఒక సినిమా చేయనున్నాని స్వయంగా ఆయనే కొద్ది రోజుల ముందు తెలిపారు.