సమంత స్థానంలోకి వచ్చిన శృతి హసన్

సమంత స్థానంలోకి వచ్చిన శృతి హసన్

Published on Nov 9, 2012 8:07 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రం “ఎవడు”లో అందాల నటి సమంత స్థానంలో మరో అందాల భామ శృతి హాసన్ చెయ్యనున్నారు. ఫిలిం నగర్లో తిరుగుతున్న ఈ వార్తకి సరైన కారణం తెలియరాలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. “గబ్బర్ సింగ్” చిత్రం భారీ విజయం సాదించిన తరువాత శృతి హాసన్ కి తెలుగులో పలు ఆఫర్లు వస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ అయిన “ఎవడు” చిత్రంలో అల్లు అర్జున్ చిన్న పాత్ర చెయ్యనున్నారు. ఏమి జాక్సన్ మరో కథానాయికగా కనిపించనున్నారు. దేవ్ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013 వేసవిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు