అతనికి ‘తుపాకి’ అవసరం ఎందుకొచ్చింది?

అతనికి ‘తుపాకి’ అవసరం ఎందుకొచ్చింది?

Published on Nov 9, 2012 8:31 AM IST

తమిళ్ స్టార్ హీరో విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘తుపాకి’ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 13న విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది. రెండు భాషలలోను ఒకే టైటిల్ తో విడుదలవుతుండటం విశేషం. గజిని, స్టాలిన్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన ప్రముఖ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బానే ఉన్నాయి. విజయ్ కి తెలుగులో క్రేజ్ లేకపోయినా ఈ సినిమాతో తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ‘ఆర్మీ కుటుంబానికి సంభందించిన ఒక యువకుడు తుపాకి ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది’ అనేది ఈ చిత్ర కథ అని దర్శకుడు చెబుతున్నారు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు అయిన హారిస్ జైరాజ్ ఈ సినిమాకి అందిస్తుందటం వల్ల కూడా యువత ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు