ఈ చిత్రం నాకెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది – లక్ష్మి మంచు

ఈ చిత్రం నాకెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది – లక్ష్మి మంచు

Published on Nov 9, 2012 12:15 AM IST

“గుండెల్లో గోదారి” చిత్రం గురించి మాట్లాడిన ప్రతిసారి లక్ష్మి మంచు ఆ చిత్రం మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారరో ఇట్టే తెలిసిపోతుంది. ఇళయరాజా సంగీతం అందించడానికి ఒప్పుకున్నప్పటి నుండి ఈ చిత్ర బృందానికి బలం పెరుగుతూ వచ్చింది. ఈ చిత్ర చిత్రీకరణ లో తనకేన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అని లక్ష్మి మంచు తెలిపారు 1986 గోదావరి వరదల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గురించి చెప్తూ లక్ష్మి మంచు ” ఈ చిత్రం కోసం నేను ఎంత కష్టపడ్డానో దేవుడికి మాత్రమే తెలుసు చిత్రం విడుదల అయ్యేంతవరకు అయన నాతో ఉంది నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం నాకు చాలా జ్ఞాపకాలను మిగిల్చింది” అని అన్నారు. తెలుగు మరియు తమిళంలో ఈ చిత్ర ఆడియో ఘన విజయం సాదించింది విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో నిర్మాత లక్ష్మి మంచు అన్ని సరిగ్గా జరగడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లక్ష్మి మంచు, ఆది,తాప్సీ మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు.

తాజా వార్తలు