ఫాంటసి చిత్రంగా తెరకెక్కుతున్న పార్వతీపురం

ఫాంటసి చిత్రంగా తెరకెక్కుతున్న పార్వతీపురం

Published on Sep 13, 2012 5:40 PM IST


ఆనంద్ రాజ్, సృష్టి , ఖుషి శర్మ ప్రధాన పాత్రలలో “పార్వతీపురం” అనే చిత్రం తెరకెక్కుతుంది. ఎం ఏ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కే కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కర్య్రక్రమాలు జరుపుకుంటుంది ఇటీవలే ఈ చిత్రం కోసం బ్రహ్మానందం మరియు చలపతి రావుల మీద కొన్ని హాస్య సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ” కొత్త రకమయిన కథ మరియు కథనాలతో నడుస్తుంది ప్రేక్షకుడి ఊహకు అందకుండా కథనం ఉండే ఫాంటసి చిత్రం. ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా తెరకెక్కించాము” అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు. మహి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు.

తాజా వార్తలు