సరికొత్త రికార్డ్స్ సృష్టించనున్న పవన్ కళ్యాణ్

సరికొత్త రికార్డ్స్ సృష్టించనున్న పవన్ కళ్యాణ్

Published on Sep 10, 2012 1:14 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 11న విడుదలవుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంత కాలంగా పవన్ సినిమాలకు భారీగా ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది మరియు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు కూడా పడనున్నాయి. ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ రాబట్టుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

తాజా వార్తలు