స్విట్జర్లాండ్ వెళ్తున్న నాగ్

స్విట్జర్లాండ్ వెళ్తున్న నాగ్

Published on Sep 9, 2012 5:40 PM IST

‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘లవ్ స్టొరీ’ చిత్రం త్వరలోనే స్విట్జర్లాండ్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్ర పూర్తి టీం ఈ నెల 13న స్విట్జర్లాండ్ కి బయలుదేరనుంది. సెప్టెంబర్ 17 నుండి జురిచ్ మరియు స్విట్జర్లాండ్ లలో చిత్రీకరణ మొదలవుతుంది మరియు ఈ షెడ్యూల్ లో నాగార్జున మరియు నయనతార మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత మిగిలిన చిత్రీకరణ కోసం ఈ చిత్ర టీం యు.ఎస్ కు పయనమవుతారు. ఈ చిత్రంలో ఇండియాకి మొదటి సారి వచ్చే ఎన్.ఆర్.ఐ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ‘బాస్’ చిత్రం తర్వాత నయనతార నాగార్జున సరసన నటిస్తున్న ఈ సరికొత్త ‘లవ్ స్టొరీ’ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహిస్తున్నారు. కామక్షి మూవీస్ బ్యానర్ పై డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు