బాలివుడ్ ఆరంగేట్రం కోసం ఆసక్తిగా వేచి చూస్తున్న మధురిమ బెనర్జీ

బాలివుడ్ ఆరంగేట్రం కోసం ఆసక్తిగా వేచి చూస్తున్న మధురిమ బెనర్జీ

Published on Sep 7, 2012 8:45 PM IST


మధురిమ బెనర్జీకి తెలుగులో సరయిన అవకాశాలు లేకపోయినా ఈ ఏడాది అంతా తనకి చాలా బాగా ఉండబోతుంది. బాలీవుడ్లో ఆరంగేట్రం చెయ్యనున్న చిత్రం “కమల్ ధమాల్ మాలామాల్” చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్దమయ్యింది ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో తనది ధనికురాలి పాత్ర అని ఒకానొక ప్రముఖ పత్రికతో తెలిపింది. ఈ చిత్రంలో ప్రముఖ నటులు నానా పటేకర్, ఓం పూరి మరియు పరేష్ రావల్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి మధురిమ చాలా ఆసక్తిగా వేచి చూస్తుంది. తెలుగులో తనని సంప్రదాయ పాత్రలకే పరిమితం చేశారని అలాంటి పాత్రలే తన వద్దకి వచ్చేవి అని కూడా ఆ పత్రికతో చెప్పారు. ప్రస్తుతం ఈ భామ వెంకటేష్ “షాడో” చిత్రంలో మరియు రాజశేకర్ “మహంకాళి” చిత్రంలో నటిస్తుంది. ఈ ఏడాది తన మలయాళం తొలి చిత్రం “బ్లాక్ కాఫీ” చిత్రం విడుదల కానుంది.

తాజా వార్తలు