మధుర శ్రీధర్ చిత్రంలో నటించనున్న మహాత్ రాఘవేంద్ర?

మధుర శ్రీధర్ చిత్రంలో నటించనున్న మహాత్ రాఘవేంద్ర?

Published on Sep 6, 2012 2:18 AM IST


వీర్య దానం మీద మధుర శ్రీధర్ తెరకెక్కించాలని అనుకున్న చిత్రానికి శ్రీధర్ హీరో కోసం వెతుకుతున్నట్టు తెలుస్తుంది. గతంలో ఈ చిత్రంలో ప్రధాన పాత్రను బ్రహ్మానందం కొడుకు గౌతం పోషిస్తారని తెలుపగా ప్రస్తుతం తమిళ నటుడు మహాత్ రాఘవేంద్ర ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారని సమాచారం ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో విడుదల చెయ్యనున్నారు అని కూడా అంటున్నారు. గతంలో ఈ నటుడు అజిత్ ప్రధాన పాత్రలో వచ్చిన “గ్యాంబ్లర్” చిత్రంలో సహాయపాత్రలో కనిపించారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం సెప్టెంబర్ 20 నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. డా. ఎంవికే రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు గతంలో ఈయన మధుర శ్రీధర్ దర్శకత్వం లో వచ్చిన “ఇట్స్ మై లవ్ స్టొరీ ” చిత్రాన్ని నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా పి జి విందా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ చిత్రంలో తారాగణం గురించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తారు.

తాజా వార్తలు