నీదానే ఎన్ పోన్వసంతం చిత్రం కోసం డబ్బింగ్ చెప్పుకోనున్న సమంత

నీదానే ఎన్ పోన్వసంతం చిత్రం కోసం డబ్బింగ్ చెప్పుకోనున్న సమంత

Published on Sep 1, 2012 11:48 AM IST


గౌతం మీనన్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “నీదానే ఎన్ పోన్వసంతం” చిత్రంలో పాత్రకు సమంత తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇప్పటి వరకు తన చిత్రాలు అన్నింటికీ చిన్మయి డబ్బింగ్ చెబుతూ వచ్చింది. సమంత డబ్బింగ్ చెప్పుకోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి తను తమిళంలో మాత్రమే డబ్బింగ్ చెప్పుకుంటుంది. తెలుగు వెర్షన్ “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రంలో కూడా తన డబ్బింగ్ తనే చెప్పుకుంటుందో లేదో చూడాలి. జీవ మరియు సమంత తమిళ వెర్షన్లో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా తెలుగులో నాని మరియు సమంతలు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఇళయరాజా అందించిన సంగీతం తమిళ వెర్షన్ ఈరోజు చెన్నైలో విడుదల కానుంది ఇళయరాజా హంగేరి ఆర్కెస్ట్రా తో కలిసి ఇవ్వబోయే ప్రదర్శన ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల కానుంది.

తాజా వార్తలు