ఆర్.ఎఫ్.సి లో అల్లరి చేస్తున్న సునీల్

ఆర్.ఎఫ్.సి లో అల్లరి చేస్తున్న సునీల్

Published on Aug 29, 2012 7:39 PM IST


‘మర్యాద రామన్న’ మరియు ‘పూలరంగడు’ సినిమాలతో ఫుల్ టైం హీరోగా మారిపోయిన నటుడు సునీల్. సునీల్ – ఇషా చావ్లా కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బాలీవుడ్లో హిట్ అయిన ‘తను వెడ్స్ మను’ చిత్రానికి రిమేక్. రష్యాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకొని ఇటీవలే ఈ చిత్ర టీం ఇండియాకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం సునీల్ మరియు ఇతర కామెడియన్ల పై కొన్ని కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ చిత్రంలో చాలా మార్పులు చేసారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై పరాస్ జైన్ మరియు ఎన్.వి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

తాజా వార్తలు