‘బిజినెస్ మేన్’ కి సీక్వెల్ తీయడం లేదు : పూరి

‘బిజినెస్ మేన్’ కి సీక్వెల్ తీయడం లేదు : పూరి

Published on Aug 5, 2012 6:00 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘బిజినెస్ మేన్’ చిత్రానికి సీక్వెల్ తీయడం లేదని ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ తెలియజేశారు. ఈ సంవత్సరం మొదట్లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాదించడంతో పూరి మరియు మహేష్ బాబు ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని అనుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే ఒక తెలుగు ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బిజినెస్ మేన్’ కి సీక్వెల్ తీయడంలేదు. ప్రస్తుతం మహేష్ ను ఊహించుకొని వేరొక కథ సిద్దం చేసుకుంటున్నాను అని పూరి జగన్నాథ్ అన్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే 2013లో పూరి – మహేష్ ల చిత్రం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘దేవుడు చేసిన మనుషులు’ ఆగష్టు 15న విడుదల కానుంది.

తాజా వార్తలు