నాకు ఎనిమిది భాషలు వచ్చు అంటున్న అందాల భామ

నాకు ఎనిమిది భాషలు వచ్చు అంటున్న అందాల భామ

Published on Aug 5, 2012 1:11 PM IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ మరియు హాట్ హీరోయిన్ శ్రుతి హాసన్. తన దగ్గర ఎవ్వరి దగ్గర లేని ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే శృతి హాసన్ 8 భాషలు మాట్లడతుంది. ప్రస్తుతం బాషతో సంభందం లేకుండా శృతి హాసన్ పలు ఇండస్ట్రీలలో అవకాశాలు అందుకుంటోంది. మీరు అన్ని భాషల్లో సినిమాలు ఎలాచేయగాలుగుతున్నారు అని అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ సమాధానమిస్తూ ” ఆలాంటి ప్రశ్నలు అడగవద్దండి..! మా అమ్మ గారు 5 భాషలు మాట్లాడతారు మరియు మా నాన్న గారు ఎన్ని భాసహ్ల్లో నటించారో మరియు ఆయనకీ వచ్చిన బాషల గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. అందువల్ల మొదట నేను భాషను పట్టించుకోను, నా పాత్రను మాత్రమే పట్టించుకుంటాను ఎందుకంటే నాకు 8 భాషలు వచ్చు” అని ఆమె అన్నారు.

శ్రుతి హాసన్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో కొన్ని కోట్ల మంది ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్లో ఒక సినిమా చేస్తున్నారు. శ్రుతి హాసన్ ఇన్ని బాషలలో మాట్లాడడం వల్ల ఒక్క భాషలోనే కాకుండా అన్ని బాషల్లోనూ తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఉండడం ఎంతో సంతోషించ దగ్గ విషయం.

తాజా వార్తలు