గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించిన ‘జులాయి’ మరియు ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలు ఒక వారం గ్యాప్ లో విడుదలవుతుండడం విశేషం. ఇలియానా తన ఆశలన్నీఈ రెండు చిత్రాలపైనే పెట్టుకుంది. ఈ చిత్రాల గురించి ఇలియానా మాట్లాడుతూ ‘ చిత్రం యొక్క కథాంశం ఒక యాక్టర్ తన నటనను ప్రదర్శించడానికి అవధులు లేని ఉత్సాహాన్ని ఇస్తుంది. పూరి జగన్నాథ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ అద్భుతమైన దర్శకులు, అలాంటి దర్శకులతో మళ్ళీ మళ్ళీ కలిసి పనిచేయడం చాలా ఆనదంగా ఉంది. ఆ ఇద్దరు మంచి దర్శకులే కాకుండా మంచి స్టోరీటెల్లర్స్ కూడా, వారు చెప్పేటప్పుడు కథ సగం వింటే చాలు ఆ సినిమాలో మన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో మరియు ఆ పాత్రలో నటించడానికి ఎంత అవకాశం ఉందో తెలిసిపోతుంది. వారి సినిమాలకు ప్రత్యేకంగా నేను కష్ట పడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వారు డిజైన్ చేసుకున్న పాత్రల పట్ల చాలా క్లియర్ గా ఉంటారు’ అని అన్నారు.
ఇలియానా నటన మీద తనకున్న అభిప్రాయం గురించి మాట్లాడుతూ ‘ నటన అనేది ఒక గొప్ప కళ. మీరు క్లాసులకు వెళ్లి, చదివి మరియు సీనియర్ నటుల నుంచి ఎంత నేర్చుకున్నా సెట్ లో స్క్రిప్ట్ మీ చేతుల్లో ఉన్నప్పుడు అన్నీ మరిచిపోయి దర్శకుడు చెప్పే విషయాల్ని తూచా తప్పకుండా పాటించాలి. ఎంత పెద్ద స్టార్లు అయినా దర్శకుడు చెప్పినట్లే నటిస్తారు’
ప్రస్తుతం ఇలియానా తెలుగులో రెండు భారీ చిత్రాలు మరియు హిందీలో ‘బర్ఫీ’ అనే చిత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాలతో 2012 రెండవ అర్ధ భాగంలో ఇలియానా బిజీగా ఉండబోతున్నారు.