సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జులాయి’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జులాయి’

Published on Aug 3, 2012 4:20 PM IST


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న చిత్రం ‘జులాయి’. ఈ రోజు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది, సెన్సార్ బోర్డ్ వారు ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. అల్లు అర్జున్ కెరీర్లో ఇప్పటివరకూ ఏ చిత్రం విడుదల కానీ విధంగా సుమారు 1600 థియేటర్లలో ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందాయి మరియు మొదటి సారి దేవీ శ్రీ ప్రసాద్ మరియు అల్లు అర్జున్ కలిసి స్టెప్పు లేసిన ప్రమోషనల్ సాంగ్ కి కూడా మంచి ఆదరణ లబించింది. గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య సమర్పణలో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు