నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న “శ్రీమన్నారాయణ”

నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న “శ్రీమన్నారాయణ”

Published on Aug 3, 2012 8:00 AM IST


నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న “శ్రీమన్నారాయణ” చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర ఆడియో విడుదల ఆగస్ట్ 6న విడుదల కానుంది. సమాజం కోసం పోరాడే విలేఖరిగా బాలకృష్ణ కనిపించనున్నారు. రవికుమార్ చావలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగస్ట్ చివరి వారంలో కాని సెప్టెంబర్ మొదటి వారంలో కాని విడుదల అయ్యే అవకాశాలున్నాయి. పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ మీద రమేష్ పుప్పాల నిర్మిస్తుండగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు

తాజా వార్తలు