ఆ ఇద్దరు దర్శకులంటే భయం అంటున్న రాజమౌళి.!

ఆ ఇద్దరు దర్శకులంటే భయం అంటున్న రాజమౌళి.!

Published on Aug 1, 2012 1:51 PM IST


తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే నిస్సంకోచంగా చెప్పే ఏకైక పేరు ఎస్.ఎస్ రాజమౌళి. రాజమౌళికి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది మరియు అతని ఆలోచనలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇలాంటి దర్శకుడికి ఇండస్ట్రీలో ఇద్డదు దర్శకులంటే భయం అంట..! ఏంటి షాక్ అయ్యారా అవునండి రాజమౌళికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సుకుమార్ అంటే భయం అని ఆయనే అన్నారు.

ఇటీవలే ఒక ప్రముఖ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో మీకు పోటీ ఇచ్చే దర్శకులు ఎవరు? అని అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ ‘ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సుకుమార్ లకు నాకంటే అద్భుతమైన నాలెడ్జ్ మరియు ప్రతిభ ఉంది. కానీ వారు పక్కా మాస్ చిత్రాలు చేయడం లేదు కాబట్టి మేము సంతోషంగా సినిమాలు చేసుకోగలుగుతున్నాం. వాళ్ళు కనుక మాస్ సినిమాలు తీయడం మొదలు పెడితే మాలాంటి వాళ్లకి కష్టం అయిపోతుంది, అందుకే ఆ ఇద్దరూ అంటే నాకు భయం అని’ ఆయన అన్నారు.

రాజమౌళి ఇండస్ట్రీలో అణకువగల వ్యక్తి, ఈ విషయంతో అది ఎంతో స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న దాని కంటే ఎంతో ఎక్కువ సామర్ధ్యం ఉన్న దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సుకుమార్ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

తాజా వార్తలు