మహేష్ బాబు కోసమే ఆ పాట చేశాను : పార్వతి

మహేష్ బాబు కోసమే ఆ పాట చేశాను : పార్వతి

Published on Aug 1, 2012 11:33 AM IST


‘దూకుడు’ చిత్రంలో చేసిన ఐటెం సాంగ్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పోడుగుకాళ్ళ సుందరి పార్వతి మెల్టన్, తనకి ఐటెం సాంగ్స్ చేయడం ఇష్టం లేదని అంటోంది. తను చేసిన ఐటెం సాంగ్ బాగా ఫేమస్ కావడంతో ప్రస్తుతం తనకి అలాంటి ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఆఫర్ల వల్ల పార్వతి కాస్త ఇబ్బందికి గురవుతున్నారు, ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘ ప్రిన్స్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా వచ్చిన అవకాశాన్ని నేను మిస్ చేసుకున్నాను. మహేష్ బాబు ప్రక్కన నటించలేకపోయాను అన్నలోటుని కొంత అయినా భర్తీ చేయడానికి ‘దూకుడు’లో ఐటెం సాంగ్ చేశాను. కేవలం మహేష్ బాబు కోసమే ఐటెం సాంగ్ చేసాను అంతే కానీ నేను ఐటెం భామను కాదు, అలాగే నాకు ఐటెం భామ కావాలనే ఆసక్తి కూడా లేదని’ ఆమె అన్నారు.

పార్వతి మెల్టన్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన ‘ శ్రీమన్నారాయణ’ మరియు సాయిరాం శంకర్ సరసన ‘ యమహో యమ’ చిత్రాల్లో నటిస్తోంది.

తాజా వార్తలు