తెలుగులోకి అనువాదం అవ్వనున్న సంతోష్ శివన్ “మకరమజ్ను”

తెలుగులోకి అనువాదం అవ్వనున్న సంతోష్ శివన్ “మకరమజ్ను”

Published on Jul 31, 2012 12:04 AM IST


భారతదేశంలో పేరొందిన సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ గత సంవత్సరం “మకరమజ్ను” చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. లెనిన్ రాజేంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిత్య మీనన్ మరియు కార్తిక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు సంవత్సరం తరువాత ఈ చిత్రాన్ని తెలుగులో “రవి వర్మ” అనే పేరుతో అనువదిస్తున్నారు. శోభ రాణి ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. సంతోష్ శివన్ ఈ చిత్రంలో ప్రముఖ చిత్ర కళాకారుడు రాజ రవి వర్మ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రాజ రవి వర్మ కథని చుపించబోతున్నారు. మధు అంబట ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా రమేష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు