అందాల రాక్షసి చిత్రంలో షేర్ కొన్న రాజమౌళి

అందాల రాక్షసి చిత్రంలో షేర్ కొన్న రాజమౌళి

Published on Jul 25, 2012 9:25 PM IST


ప్రతిభను సరిగ్గా అంచనా వేయగలిగిన వారిలో రాజమౌళి ఒకరు. “అందాల రాక్షసి” చిత్రం ఆయన్ని బాగా ఆకట్టుకోవడంతో అయన ఆ చిత్రంలో షేర్ కొనుక్కోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి రాజమౌళి, సాయి కొర్రపాటితో కలిసి సహా నిర్మాణం చేస్తున్నారు. ఈ చిత్రం ఆంద్రప్రదేశ్లో దిల్ రాజు విడుదల చెయ్యనున్నారు. సినిమా అభిమానులను కూడా ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంది. కథానాయిక లావణ్యకి ఇప్పటికే యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది.

హను రాఘవపూడి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. నవీన్ చంద్ర మరియు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 90లలో జరిగిన త్రికోణ ప్రేమకథ చిత్రంగా ఈ చిత్రం ఉంటుంది. “అందాల రాక్షసి” చిత్రం ఆగస్ట్ రెండవ వారంలో విడుదల కానుంది.

తాజా వార్తలు