కొరియర్ బాయ్ కి హీరోయిన్ దొరికింది

కొరియర్ బాయ్ కి హీరోయిన్ దొరికింది

Published on Jul 25, 2012 7:09 PM IST


చాలా కాలం తర్వాత ‘ఇష్క్’ సినిమాతో హిట్ కొట్టిన హీరో నితిన్ ఈ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే కథానాయికగా ఎంపికయ్యారు. ముందుగా ఈ చిత్రంలో రిచా గంగోపాద్యాయ పేరుని పరిశీలించారు కానీ చివరికి పూజాహెగ్డేకి అవకాశం దక్కింది. పూజా హెగ్డే నటించిన ‘మూగమూడి(తమిళ్)’ చిత్రం త్వరలో తమిళ మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర మొదటి షెడ్యూల్ జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రేమ్ సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. తమిళంలో జై హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి తమిళంలో ‘తమిళ్ సెల్వనం తనియర్ అంజలం’ అనే పేరును ఖరారు చేశారు. ప్రముఖ సింగర్ కార్తీక్ ‘ఆరవన్(ఏకవీర)’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఒక్కడినే’ చిత్రం ద్వారా తెలుగులో పరిచయమవుతున్నారు మరియు ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ తెలుగులో తను సంగీతం అందిస్తున్న రెండవ చిత్రం.

తాజా వార్తలు