కామెడి కింగ్ ‘అల్లరి’ నరేష్ సడన్ స్టార్ గా వస్తున్న ‘సుడిగాడు’ చిత్రం హెక్సా ప్లాటినం డిస్క్ నిన్న హైదరాబాద్లో జరిగింది. అదేనండి ఆడియో ఫంక్షన్ రొటీన్ అని ఒకే సారి హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసేశారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర మొదటి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి భారీ స్పందన లబిస్తోంది. ‘తమిళ్ పడమ్’ అనే తమిళ చిత్రానికి రిమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో తెలుగులో విజయం సాదించిన చిత్రాలలోని సన్నివేశాలను పేరడీ చేశారు.
విడుదలైన మొదటి రోజే 350 కోట్లు కలెక్ట్ చేసినట్టు చెప్తూ ట్రైలర్ ని మొదలుపెట్టి, ప్రపంచంలో అన్యాయాలు పెరిగినప్పుడు దేవుడు తెలుగు సినిమా హీరో రూపంలో పుడతాడని చెప్పే తర్వాత డైలాగ్ చాలా కామెడీగా ఉంది. ఆ తర్వాత ట్రైలర్ లో ‘ఊసరవెల్లి’ చిత్రంలోని కరెంటు తీగ కూడా నాలా సన్నగా ఉంటుంది అనే డైలాగ్ తో ఎన్.టి.ఆర్ ని, ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని నాక్కొంచం తిక్కుంది దానికో లెక్కుంది అనే డైలాగ్ తో పవన్ కళ్యాణ్ ని, ‘రచ్చ’ చిత్రంలోని నేను అరిస్తే అరుపులే అనే డైలాగ్ తో రామ్ చరణ్ ని, కమల్ హాసన్ ని మరియు రజనీ కాంత్ ని కూడా పేరడీ చేసిన సన్నివేశాలతో నరేష్ బాగా నవ్విస్తూ చివరిగా ‘దూకుడు’ చిత్రంలోని నాకు ఎస్సెమ్మెస్ చెయ్యండి అనే పేరడీతో ట్రైలర్ ని ముగించారు. ఈ చిత్ర ట్రైలరే ఇంత నవ్విస్తే ఇక రెండున్నర గంటలపాటు సాగే పూర్తి సినిమాలో ప్రేక్షకులు నవ్వలేక వారి కడుపు చక్కలవుతుందేమో.
మోనాల్ గజ్జర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. శ్రీ వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డి. చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి